HomeUncategorizedఆడబిడ్డను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తే ఖబర్దార్!

ఆడబిడ్డను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తే ఖబర్దార్!

📰 Generate e-Paper Clip

BRS నాయకులు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డిలపై యూత్ కాంగ్రెస్ నేత రెడ్డి శ్రీను మండిపాటు

కొడంగల్, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ఓమన్ దేశం మస్కట్‌లో చిక్కుకున్న తన కొడుకు సహాయం కోసం వస్తే, ఆ విషయాన్ని ఆసరాగా చేసుకుని BRS నాయకులు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీను ముదిరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులను పట్టించుకోలేదంటూ BRS నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ, సీఎం వ్యక్తిత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల కష్టాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే నీచమైన ఆలోచనలను ఇప్పటికైనా విడనాడాలని, లేకుంటే భవిష్యత్తులో వారికి పుట్టగతులు ఉండవని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలు BRS నాయకుల అబద్ధాలను నమ్మే పరిస్థితిలో లేరని, రాజకీయ లబ్ధి కోసం ఆడబిడ్డల సమస్యలను అడ్డం పెట్టుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భీమ్ రెడ్డి, షకీల్ మొహమ్మద్, అశోక్ గౌడ్, శివ రెడ్డి, మాధవ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular