HomeUncategorizedవిలేకరుల వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఉచిత శిక్షణ

విలేకరుల వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఉచిత శిక్షణ

📰 Generate e-Paper Clip

కోకిల జర్నలిజం స్కూల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 13 తేదీల్లో తరగతులు 

యువత, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

డి.ఎం.డబ్ల్యూ.జె.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాయితి శంకర్

జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా ముద్ర న్యూస్): మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడానికి, విలేకరుల వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించడానికి కోకిల జర్నలిజం స్కూల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (DMWJU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాయితి శంకర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో వచ్చే నెల డిసెంబర్ 12, 13 తేదీల్లో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరుగుతుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కాయితి శంకర్ మాట్లాడుతూ.. జర్నలిజం పట్ల ఆసక్తి ఉన్న యువతీ యువకులతో పాటు ప్రస్తుతం వివిధ మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు వృత్తిలో రాణించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. కేవలం వార్తా సేకరణకే పరిమితం కాకుండా జర్నలిస్టులలో దేశభక్తి, సమాజం పట్ల గౌరవం, చట్టాల పట్ల పూర్తి అవగాహన పెంపొందించడం, సామాజిక సేవ చేయాలనే స్పృహను కలిగించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో మీడియా రంగంలో వస్తున్న నూతన సాంకేతిక అంశాలను తెలుసుకొని, డిజిటల్ జర్నలిస్టులుగా రాణిస్తూ జీవితంలో స్థిరపడేందుకు, భవిష్యత్తులో ఎదురయ్యే వృత్తిపరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నిపుణులతో ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులందరికీ కోకిల జర్నలిజం స్కూల్ తరపున సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడించారు. ఆసక్తి గల యువతీ యువకులు, విలేకరులు తమ పేర్లను 9491322556 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపి ముందుగా నమోదు చేసుకోవాలని, ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular