HomeUncategorizedచింతగూడలో భక్తిశ్రద్ధలతో 'గడపగడపకు హనుమాన్ చాలీసా' కార్యక్రమం

చింతగూడలో భక్తిశ్రద్ధలతో ‘గడపగడపకు హనుమాన్ చాలీసా’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

జన్నారం, నవంబర్ 14(ప్రజా ముద్ర న్యూస్) : మండలంలోని చింతగూడ గ్రామంలో భక్తజన మండలి ఆధ్వర్యంలో ‘గడపగడపకు హనుమాన్ చాలీసా’ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. భక్తులు ఇంటింటికీ వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం, భజన కీర్తనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నారు.

హనుమంతుని నామస్మరణతో, భక్తి గీతాలతో చింతగూడ గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భక్తజన మండలి సభ్యులు, హనుమాన్ చాలీసా భక్తులు పూజారి ప్రభాకర్ చారి, ఆరె సత్యం, పోడేటి నరేష్ గౌడ్, చీర్నెని నరేష్, సీపతి రాజిరెడ్డి, మడ్ల సురేష్, ఆరె శ్రీనివాస్, మొలుమూరి నగేష్, చీర్నెని సురేష్, ఆరె లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular