ఎండపల్లి, నవంబర్ 06(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజరాంపల్లి లో విద్యుత్ రూపంలో మృత్యువు పసిప్రాణాన్ని బలిగొంది. ఇంట్లో ఆడుకుంటూ చార్జింగ్ పెట్టిన విద్యుత్ కాంటా, (తూకం వేసే పరికరం)ను తాకడంతో 10 నెలల చిన్నారి విభూది ఆద్య విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు సమాచారం. ఎండపల్లి మండలం రాజారాంపల్లి
గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుడే లోకాన్ని చూడటం ప్రారంభించిన పసిపాప అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ షాక్తో 10 నెలల చిన్నారి మృతి
RELATED ARTICLES
