అవసరమైతే రైతాంగంతో అసెంబ్లీ ముట్టడిస్తాం: రైతు నేత భూతం శ్రీనివాస్ హెచ్చరిక
జన్నారం, నవంబర్ 05(ప్రజా ముద్ర న్యూస్) : కడెం ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలని రైతు నేత భూతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పంట పూర్తిస్థాయిలో చేతికి వచ్చే వరకు నిరంతరాయంగా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నీటి సరఫరా మధ్యలో నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేద
న వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో జన్నారం మండల రైతాంగం ఆధ్వర్యంలో అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
