HomeUncategorizedజాతీయ స్థాయిలో సత్తా చాటిన జన్నారం విద్యార్థి అభిషేక్

జాతీయ స్థాయిలో సత్తా చాటిన జన్నారం విద్యార్థి అభిషేక్

📰 Generate e-Paper Clip

వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ బహుమతి సాధించిన రాఘవేంద్ర కాలేజీ విద్యార్థి

అభినందించిన కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు

జన్నారం, నవంబర్ 10 (ప్రజా ముద్ర న్యూస్) : జన్నారం మండలంలోని రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొట్టె అభిషేక్ జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి బహుమతి సాధించారు. ఇదివరలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న అభిషేక్, తాజాగా జాతీయ స్థాయి పోటీల్లోనూ తన సత్తా చాటుకుని కళాశాలకు మరియు ప్రాంతానికి పేరు తెచ్చారు.

ఈ సందర్భంగా రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ విద్యార్థి అభిషేక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఇలాంటి క్రీడలు, కళల్లో రాణించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో బహుమతులు గెలుచుకుని, కళాశాలకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ అభినందన కార్యక్రమంలో రాఘవేంద్ర విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎర్ర సంపత్, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్, డీన్ హేమలత షిండే, కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో విజయం సాధించిన అభిషేక్‌ను పలువురు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular