HomeUncategorizedపోకిరీల అడ్డాగా మారిన ఎన్టీఆర్ నగర్ రోడ్ నంబర్ – 10

పోకిరీల అడ్డాగా మారిన ఎన్టీఆర్ నగర్ రోడ్ నంబర్ – 10

📰 Generate e-Paper Clip

అర్ధరాత్రి యువకుల ఆగడాలతో మహిళల్లో భయాందోళన..

పోలీసుల రాత్రి గస్తీకి స్థానికుల విజ్ఞప్తి..

జగిత్యాల జిల్లా, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ రోడ్ నంబర్ – 10లో అర్ధరాత్రి వేళ యువకుల హడావుడి స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. కొందరు యువకులు మద్యం మత్తులో రోడ్లపై గుంపులుగా తిరుగుతూ హంగామా సృష్టిస్తుండటంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ బయటకు రావాలంటేనే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత పోలీసు అధికారులు స్పందించి రోడ్ నంబర్ – 10తో పాటు పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళ ప్రత్యేక గస్తీ నిర్వహించి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular