‘ది ప్యారడైజ్’ సినిమాలో పటేల్ పాటల చిత్రీకరణపై ప్రశంసలు
శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రతిమ అందజేత.. తండ్రి ఓదెల చంద్రయ్య పటేల్‌కు ఘన సన్మానం
జగిత్యాల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : ప్రముఖ సినీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర అధ్యక్షు
డు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మరియు మున్నూరు కాపు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో పటేల్ పాటలను అద్భుతంగా చిత్రీకరించడంతో పాటు, మున్నూరు కాపుల సామాజిక గుర్తింపును ప్రతిబింబించే ‘పటేల్’ పదానికి ప్రాధాన్యతనిస్తూ చూపించినందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. సినిమా వంటి శక్తివంతమైన మాధ్యమం ద్వారా ఒక సామాజిక వర్గం సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం ప్రజల్లోకి వెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన తండ్రి ఓదెల చంద్రయ్య పటేల్‌ను కూడా ఆత్మీయంగా అభినందించి, స్వామివారి కండువా, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ.. సినిమా రంగంలో తనదైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న శ్రీకాంత్ ఓదెల తన చిత్రంలో పటేల్ గుర్తింపునకు స్థానం కల్పించడం సంతోషకరమన్నారు. యువత తమ మూలాలను, సంస్కృతిని గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శ్రీకాంత్ ఓదెల భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలను రూపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. జీఎంఏ కన్వీనర్ సంఘాని రజనీకాంత్ పటేల్ మాట్లాడుతూ.. సినీ రంగంలో శ్రీకాంత్ ఓదెల సాధిస్తున్న విజయాలు అభినందనీయమని, తన సినిమా ద్వారా పటేల్ గుర్తింపుకు ప్రాధాన్యత ఇవ్వడం మున్నూరు కాపు సమాజానికి ఆనందకరమైన విషయమని అన్నారు. కళలు, సినిమా వంటి మాధ్యమాలు సమాజంలోని వివిధ వర్గాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. యువ దర్శకులు తమ ప్రతిభతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాయిస్ టుడే న్యూస్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, జర్నలిస్టు ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, గ్రేటర్ హైదరాబాద్ పటేల్ సంఘం జనరల్ సెక్రటరీ పెరిక రమేష్ పటేల్, ఆకుల వివేక్ పటేల్, యువ నాయకుడు సాదుల వర్షిత్ పటేల్, అమెరికా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జీఎంఏ కన్వీనర్ సంఘాని రజనీకాంత్ పటేల్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ ఆత్మీయ కలయికలో మున్నూరు కాపు సమాజ ఐక్యత, పరస్పర గౌరవం, పటేల్‌ల సంస్కృతి పట్ల అభిమానభావం ప్రతిబింబించాయి.
