HomeUncategorizedమృతి చెందిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా చింతగూడ గ్రామస్తులు

మృతి చెందిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా చింతగూడ గ్రామస్తులు

📰 Generate e-Paper Clip

గల్ఫ్ అసోసియేషన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.72,967 ఆర్థిక సాయం అందజేత

జన్నారం, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు బాదావత్ రాజ్య నాయక్ గత వారం రోజుల క్రితం మృతి చెందగా.. ఆయన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ‘చింతగూడ గల్ఫ్ అసోసియేషన్’, గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు.

రాజ్య నాయక్ మరణంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన తల్లిదండ్రులను ఆదుకునేందుకు గల్ఫ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ముందుకు వచ్చి రూ. 52,967 విరాళాలు సేకరించారు. దీనికి తోడు చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ సంస్థ తరపున మరో రూ. 20,000 జత చేసి, మొత్తం రూ. 72,967 నగదును గ్రామస్తులు మరియు గల్ఫ్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సేవా కార్యక్రమంలో గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు దాతలు పాల్గొన్నారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, విరాళాలు అందించిన దాతలందరికీ రాజ్య నాయక్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular