కిరణ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
జన్నారం, అక్టోబర్ 31(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన కీ.శే. పత్తి కిరణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషాదకర సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామస్తులందరూ ఏకమయ్యారు.
గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి, మొత్తం
రూ. 24,750/- (రూపాయలు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై) నగదును శనివారం రోజున మృతుడు కిరణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్క దాతకూ, గ్రామ పెద్దలకు, యువతకు కిరణ్ కుటుంబ సభ్యులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
