ఆపదలో ఉన్న తోటివారికి అండగా చింతగూడ గ్రామస్తులు..
కిరణ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. జన్నారం, అక్టోబర్ 31(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన కీ.శే. పత్తి కిరణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషాదకర సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామస్తులందరూ ఏకమయ్యారు. గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి, మొత్తం రూ. 24,750/- (రూపాయలు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై) నగదును శనివారం రోజున మృతుడు కిరణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో...