రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బోయ నగేష్
చాంద్రాయణగుట్ట, నవంబర్ 15(ప్రజా ప్రతినిధి) : చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జంగంమెట్ డివిజన్, శివాజీ నగర్ ఫేస్-1లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ నేడు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో బస్తీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, స్థానికుల చిరకాల వాంఛ అయిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వానికి,
బస్తీ వాసుల కృతజ్ఞతలు:
తమ ప్రాంత సమస్యపై స్పందించి నిధులు మంజూరు చేయడంపై శివాజీ నగర్ ఫేస్-1 బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
