శివాజీ నగర్ ఫేస్-1లో అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బోయ నగేష్ చాంద్రాయణగుట్ట, నవంబర్ 15(ప్రజా ప్రతినిధి) : చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జంగంమెట్ డివిజన్, శివాజీ నగర్ ఫేస్-1లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా...