HomeUncategorizedపోకిరీల అడ్డాగా మారిన ఆర్ఎన్టీ నగర్ రోడ్ నంబర్ – 10

పోకిరీల అడ్డాగా మారిన ఆర్ఎన్టీ నగర్ రోడ్ నంబర్ – 10

📰 Generate e-Paper Clip

అర్ధరాత్రి యువకుల మత్తు ఆగడాలతో మహిళల్లో భయాందోళనలు..

పోలీసుల రాత్రి గస్తీకి స్థానికుల విజ్ఞప్తి

జగిత్యాల జిల్లా, నవంబర్ 13(ప్రజా ముద్ర న్యూస్) : జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్టీ నగర్ రోడ్ నంబర్ – 10లో అర్ధరాత్రి వేళ యువకుల హడావుడి స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. కొందరు యువకులు మద్యం మరియు గంజాయు మత్తులో రోడ్లపై గుంపులుగా తిరుగుతూ హంగామా సృష్టిస్తుండటంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ బయటకు రావాలంటేనే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత పోలీసు అధికారులు స్పందించి రోడ్ నంబర్ – 10తో పాటు పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళ ప్రత్యేక గస్తీ నిర్వహించి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ప్రవర్తన మారని పోకిరీలపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular