HomeUncategorizedఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

📰 Generate e-Paper Clip

జువ్వాడి బ్రదర్స్ కు బీఆర్ఎస్ నాయకులు వార్నింగ్

కోరుట్ల, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్‌పై జువ్వాడి కృష్ణారావు సోదరులు చేస్తున్న అనవసరమైన అసత్యపు ప్రచారాలను, ఆరోపణలను తక్షణమే మానుకోవాలని స్థానిక నాయకులు హెచ్చరించారు. ఆదివారం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జువ్వాడి కృష్ణారావు సోదరులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై వాస్తవదూరమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని, అనునిత్యం ప్రజల సంక్షేమం మరియు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆరాటపడుతున్నారని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటీ వెంకట్రావు, మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, కౌన్సిలర్ పహిమ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular