HomeUncategorizedకుక్కల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్

కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్

📰 Generate e-Paper Clip

కోరుట్ల, నవంబర్ 03)ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 21 వార్డులో కుక్కల దాడిలో గాయపడిన బాలుడి గురించి విషయం తెలుసుకున్న కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల డా. సంజయ్ కుమార్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాలుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలను ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు పంపకూడదని, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకూడదని పేర్కొన్నారు. వీధి కుక్కలను త్వరలోనే మున్సిపల్ అధికారులచే పట్టించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular