ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి
జువ్వాడి బ్రదర్స్ కు బీఆర్ఎస్ నాయకులు వార్నింగ్ కోరుట్ల, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్‌పై జువ్వాడి కృష్ణారావు సోదరులు చేస్తున్న అనవసరమైన అసత్యపు ప్రచారాలను, ఆరోపణలను తక్షణమే మానుకోవాలని స్థానిక నాయకులు హెచ్చరించారు. ఆదివారం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జువ్వాడి కృష్ణారావు సోదరులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై వాస్తవదూరమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి...