HomeUncategorizedఆసిఫాబాద్ లుంబిని దీక్షాభూమిలో విజృంభించిన 70వ ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం

ఆసిఫాబాద్ లుంబిని దీక్షాభూమిలో విజృంభించిన 70వ ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం

📰 Generate e-Paper Clip

ఆసిఫాబాద్, అక్టోబర్ 29(ప్రజా ముద్ర న్యూస్) : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షాభూమిలో 70వ అశోక ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ధర్మచక్రానికి, బౌద్ధ గురువులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ.. అశోక ధర్మచక్రం శాంతి, న్యాయం, సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించడం భారత సామాజిక చరిత్రలోనే ఒక గొప్ప పరివర్తనకు నాంది అని గుర్తుచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, ఆసిఫాబాద్‌లోని అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సామాజిక ఐక్యతను పెంపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ నాయకులు సోమయ్య, వాంకిడి ఉపాధ్యక్షుడు నిజం, మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, టౌన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్, రాజ్యాంగ రక్షణ దళ్ ఫౌండర్ రేంజర్ల రాజేష్, అంబేద్కర్ సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular