కోరుట్ల, అక్టోబర్ 30)ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల
పట్టణ బీజేపీ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.వై అనూప్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా డాక్టర్స్ కన్వీనర్ గంగా సాగర్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా మారిందని దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని, ప్రతి దేశం నరేంద్ర మోడీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సన్మానిస్తుందని అలాంటి భారత దేశ ప్రధానిని కొన్ని సంఘ విద్రోహ శక్తులు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీని గద్దె దించాలని శత్రు దేశాల సహకారంతో దేశంలో అల్లర్లు సృష్టించాలని, కొంత మంది దేశానికి ధర్మాసనంకి విఘాతం కలిగించేలా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆన్లైన్ పార్టీని స్థాపించి దాని ద్వారా అమాయకైన విద్యార్థులను అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పై నరేంద్ర మోడీ పై అసత్యాలను ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కానీ దేశ ప్రజలు అందరూ కూడా నరేంద్ర మోడీ కి అండగా ఉన్నారని నరేంద్ర మోడీని కానీ బీజేపీ ప్రభుత్వంనీ కానీ ఏమి చేయలేరని వారు వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గ మేధావులు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కోరుట్ల మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు, కోరుట్ల మండల మల్లాపూర్ మండల అధ్యక్షుడు, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
బీజేపీ కోరుట్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు..
RELATED ARTICLES
