HomeUncategorizedనిర్మల్ మహా పాదయాత్రలో పాల్గొన్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్

నిర్మల్ మహా పాదయాత్రలో పాల్గొన్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్

📰 Generate e-Paper Clip

కోరుట్ల, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన మహా పాదయాత్రలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు, కోరుట్ల నియోజకవర్గ నాయకుడు సురభి నవీన్ కుమార్.. కోరుట్ల మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు,బీజేపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, ఎలాంటి కష్టం వచ్చినా తనను సంప్రదించాలని సురభి నవీన్ కుమార్ కార్యకర్తలకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నవీన్ వెంట పెద్ద సంఖ్యలో కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular