నిర్మల్ మహా పాదయాత్రలో పాల్గొన్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్
కోరుట్ల, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన మహా పాదయాత్రలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు, కోరుట్ల నియోజకవర్గ నాయకుడు సురభి నవీన్ కుమార్.. కోరుట్ల మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు,బీజేపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, ఎలాంటి కష్టం వచ్చినా...