HomeUncategorizedవైకుంఠ ధామానికి గ్రహణం.. నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న అంత్యక్రియల వేదిక

వైకుంఠ ధామానికి గ్రహణం.. నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న అంత్యక్రియల వేదిక

📰 Generate e-Paper Clip

జన్నారం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని టీజీ పల్లి గ్రామ శివారులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామం నేడు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతోంది. అంత్యక్రియలకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన వైకుంఠ ధా

మం ముందు పిచ్చి మొక్కలు పెరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా వైకుంఠ ధామం ముందు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినా వాటిని తొలగించేందుకు సంబంధిత అధికారులు, పాలకవర్గం కనీస చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరణించిన వారి అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైకుంఠ ధామాలను నిర్మించినప్పటికీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటి నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న గ్రామంలోనే వైకుంఠ ధామం పరిస్థితి ఇలా ఉంటే, మండలంలోని ఇతర గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పాలకవర్గం, అధికారులు స్పందించి వైకుంఠ ధామం ముందు పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular