వైకుంఠ ధామానికి గ్రహణం.. నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న అంత్యక్రియల వేదిక
జన్నారం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని టీజీ పల్లి గ్రామ శివారులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామం నేడు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతోంది. అంత్యక్రియలకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన వైకుంఠ ధా మం ముందు పిచ్చి మొక్కలు పెరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వైకుంఠ ధామం ముందు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినా వాటిని తొలగించేందుకు సంబంధిత అధికారులు, పాలకవర్గం కనీస చర్యలు చేపట్టడం లేదని...