HomeUncategorizedసాగు భూమి సంరక్షణ కార్యక్రమం..

సాగు భూమి సంరక్షణ కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

కోరుట్ల, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : మండలంలోని సంగెం గ్రామంలో శుక్రవారం సాగు భూమి సంరక్షణ (ఖేత్ భచావో అభియాన్ ) మండల వ్యవసాయ అధికారిని నాగమణి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయధికారి నాగమణి మాట్లాడుతూ.. భూమిని ఏ విధంగా సంరక్షిచుకోవాలో రైతులకు స్పష్టంగా వివరించారు. అలాగే యాసంగిలో వరి పంటకు అవసరమైన నీరు సరిపోదు కాబట్టి వరి పంట వేయకుండా అపరాలకు మొగ్గు చూపాలని రైతులకు వివరించారు. సబ్సిడీ లో మినుములు అందుబాటులో వున్నవని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular