HomeUncategorizedఘనంగా మౌలానా ఆజాద్ కలాం జయంతి వేడుకలు

ఘనంగా మౌలానా ఆజాద్ కలాం జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నిర్మల్ జిల్లా, నవంబర్ 01(ప్రజా ముద్ర న్యూస్) : స్వాతంత్ర్య సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా నిర్మల్ జిల్లా రత్నాపూర్ కాండ్లి గ్రామపంచాయతీ నందు ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ప్రతి ఒక్కరూ మౌలాన అబుల్ కలాం ఆజాద్ ను ఆదర్శంగా తీసుకోవాలని రత్నాపూర్ కాండ్లీ గ్రామ సర్పంచ్ గడ్డం హరీష్ సూచించారు. కలాం గుణం సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆజాద్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఆజాద్ సాంకేతిక విద్యకు మౌలానా ఆజాద్ సముచిత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఇందులో ఉపసర్పంచ్ భీమేష్ , శేఖ్ మాజీద్ , ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular