HomeUncategorizedజీఎస్టీ ఎగవేతదారులకు స్వర్గధామంగా జన్నారం మండలం!

జీఎస్టీ ఎగవేతదారులకు స్వర్గధామంగా జన్నారం మండలం!

📰 Generate e-Paper Clip

జన్నారం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో కొన్నేళ్లుగా జీఎస్టీ (GST) ఎగవేత దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బడా వ్యాపారాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించకుండా కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయాల్లోనూ కీలక పాత్ర:
స్థానికంగా వ్యాపారాలు విస్తరించిన ఈ బడా వ్యాపార వర్గాలు, ఇప్పుడు స్థానిక రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని సమాచారం. తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు కల్పించకపోవడమే కాకుండా, లేబర్ నియమ నిబంధనలను సైతం తిరస్కరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్:
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీఎస్టీ మరియు లేబర్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి జన్నారంలో తనిఖీలు చేపట్టాలని, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ రూపాన్ని కాపాడాలని స్థానిక నేతలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular