HomeUncategorizedనిర్మల్‌లో బీజేపీ ‘మహా పాదయాత్ర’ ఘనంగా ప్రారంభం

నిర్మల్‌లో బీజేపీ ‘మహా పాదయాత్ర’ ఘనంగా ప్రారంభం

📰 Generate e-Paper Clip

నిర్మల్, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ‘మహా పాదయాత్ర’ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ చౌరస్తా వద్ద బీజేపీ ముఖ్య నాయకులు జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు.

ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బాన్సల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రేఖ శర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. వారితో పాటు పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, జి. నగేష్, ధర్మపురి అరవింద్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ సహా రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలు భారీ సంఖ్యలో అడుగులు వేశారు.

సమావేశంలో ‘ఎస్.ఐ.ఆర్’ పై విస్తృత చర్చ:
పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్య నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో ఎస్.ఐ.ఆర్ (SIR) అమలు, దానికి సంబంధించిన అంశాలు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలను నేతలు క్లుప్తంగా వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వక్తలు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular