HomeUncategorizedఫుట్‌బాల్‌లో మెరిసిన కార్తిక్‌.. రాష్ట్రస్థాయి పోటీల్లో మైనారిటీ పాఠశాల విద్యార్థి సత్తా

ఫుట్‌బాల్‌లో మెరిసిన కార్తిక్‌.. రాష్ట్రస్థాయి పోటీల్లో మైనారిటీ పాఠశాల విద్యార్థి సత్తా

📰 Generate e-Paper Clip

ఉమ్మడి ఆదిలాబాద్‌ జట్టుకు ద్వితీయ స్థానం

అభినందించిన జిల్లా కలెక్టర్‌ కె. హరిత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, నవంబర్ 02(ప్రజా ముద్ర న్యూస్) : క్రీడలపై ఆసక్తి, సాధనతో కాగజ్‌నగర్‌ బాయ్స్‌-2 మైనారిటీ పాఠశాల విద్యార్థి ఈ. కార్తిక్‌ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ చాటాడు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-14 బాలుర పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.

రాష్ట్రస్థాయి బరిలో..
మేడ్చల్‌ జిల్లా పరిధిలోని హైదరాబాద్‌ సన్‌ఫ్లవర్‌ వేదిక్‌ పాఠశాలలో అక్టోబర్ 29 నుంచి 31 వరకు పోటీలు జరిగాయి. ఇందులో 8వ తరగతి చదువుతున్న కార్తిక్‌ జిల్లా జట్టులో చోటు దక్కించుకుని రాష్ట్రస్థాయి వేదికపై తన ఆటతీరును ప్రదర్శించాడు. చిన్న వయసులోనే ఈ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చింది.


జిల్లా జట్టు విజయంపై కలెక్టర్‌ కె. హరిత క్రీడాకారులను అభినందించారు. చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యమిస్తూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తిరుపతి మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. ఖాజామొయినుద్దీన్‌ మాట్లాడుతూ కార్తిక్‌ సాధించిన గుర్తింపు తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పీఈటీ చిరంజీవి మాట్లాడుతూ నిరంతర సాధన, క్రమశిక్షణతో క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. కార్తిక్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో జట్టు మేనేజర్‌ ఎం. రమేష్‌, కోచ్‌ బి. రాజశేఖర్‌, పీఈటీ వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular