బాదంపల్లిలో ఐకెపి వివో భవన నిర్మాణానికి భూమి పూజ
మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం (ఐకెపి) ద్వారా మంజూరైన విలేజ్ ఆర్గనైజేషన్ (వివో) భవన నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సామల్ల విజయలక్ష్మి లక్ష్మీరాజం మాట్లాడుతూ, మహిళా సంఘాల బలోపేతానికి ఎంతో ఉపయోగపడే వివో భవనం 'విబిజీ రాంజీ' నిధుల నుండి మంజూరు కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్...