PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:45 am Posted by : PRAJA MUDRA NEWS

బాదంపల్లిలో ఐకెపి వివో భవన నిర్మాణానికి భూమి పూజ

 

మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం (ఐకెపి) ద్వారా మంజూరైన విలేజ్ ఆర్గనైజేషన్ (వివో) భవన నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సామల్ల విజయలక్ష్మి లక్ష్మీరాజం మాట్లాడుతూ, మహిళా సంఘాల బలోపేతానికి ఎంతో ఉపయోగపడే వివో భవనం ‘విబిజీ రాంజీ’ నిధుల నుండి మంజూరు కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాసెట్టి లక్ష్మణ్ మాట్లాడుతూ, నేటి మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆర్థికంగా ఎదిగి అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటపలుకుల లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు రవి, గడ్డి శంకర్, రాజేందర్, రాజేష్, గ్రామ కార్యదర్శి సంతోష్, ఐకెపి సిబ్బంది రజిత, సదాచారి, రమాదేవితో పాటు పలువురు గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.