ధర్మపురి నియోజకవర్గంలో రూ. 1.20 కోట్లతో అభివృద్ధి పనులు
పలు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాళేశ్వరం బ్యారేజీ దిగువన నిలబడి పంపులు ఆన్ చేయాలని కేసీఆర్, కేటీఆర్‌లకు సవాల్ పెద్దపల్లి జిల్లా, నవంబర్ 13(ప్రజా ముద్ర న్యూస్) : ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సుమారు రూ. 1.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. శుక్రవారం పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పర్యటించిన ఆయన, పత్తిపాక మరియు నర్సింగాపూర్ గ్రామాల్లో రూ. 12 లక్షల...