PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 9:43 pm Posted by : PRAJA MUDRA NEWS

టీ ఎస్ డబ్ల్యూ జే ఏ జిల్లా జాయింట్ సెక్రెటరీగా మేడ మురళీధర్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రెటరీగా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు మేడ మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన జర్నలిస్టుల ఏకాభిప్రాయంతో మేడ మురళీధర్‌ను జిల్లా జాయింట్ సెక్రెటరీగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, సంఘం నాయకులు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేడ మురళీధర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన జిల్లా నాయకత్వానికి, తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎన్నిక పట్ల జన్నారం మండల జర్నలిస్టులు, స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.