PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 8:02 pm Posted by : PRAJA MUDRA NEWS

17వ వార్డుకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలిమంత్రి వివేక్ వెంకటస్వామికి బీజేపీ నేత వేణుగోపాల్ వినతి

సిద్దిపేట టౌన్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : సిద్దిపేట పట్టణంలోని 17వ వార్డులో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగేలా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపెళ్లి వేణుగోపాల్ సిద్దిపేట జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు.

మంగళవారం సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 17వ వార్డులో అద్దె ఇళ్లలో నివసిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన నిరుపేదల దుస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత కేటాయింపులు సరిపోవడం లేదని, వార్డు అవసరాల దృష్ట్యా అదనపు ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, 17వ వార్డుకు అతి త్వరలోనే మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.