సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రుల పరిశీలన

సిద్దిపేట, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, ప్రజల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు, పార్టీ నాయకులకు పలు కీలక సూచనలు...