జన్నారం, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం కోసం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు విరాళాలు సేకరిస్తున్న సందర్భంగా, గ్రామానికి చెందిన ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ డి. శ్రీనివాస్ – పద్మజ దంపతులు తమ వంతు భక్తిశ్రద్ధలతో రూ. 10,000 (పది వేల రూపాయలు) నగదును
విరాళంగా అందజేశారు.
ఆలయ పునర్నిర్మాణానికి పెద్ద మనసుతో ముందుకొచ్చి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించిన డి. శ్రీనివాస్ – పద్మజ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించి, కృతజ్ఞతలు తెలియజేశారు.