లక్షేట్టిపేటలో రైస్ డిపో ప్రారంభించిన కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజలకు అందుబాటులో బియ్యం ధరలు..  లక్షేట్టిపేట, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం విక్రయ కేంద్రాలను (అవుట్‌లెట్లను) ఏర్పాటు చేస్తోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన రైస్ అవుట్‌లెట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్ నినో ప్రభావం వల్ల మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బియ్యం వ్యాపారులు,...