PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 8:25 pm Posted by : PRAJA MUDRA NEWS

రాహుల్ గాంధీకి డా. మన్మోహన్ సింగ్ మెమోరియల్ పార్క్ పుస్తకాన్ని అందజేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ‘మెమోరియల్ పార్క్’ విశేషాలతో కూడిన ప్రత్యేక పుస్తకాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అందజేశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా జన్‌పథ్‌లోని రాహుల్ గాంధీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్ కుమార్ గౌడ్ ఈ పుస్తకాన్ని బహూకరించారు.

దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మహానేతగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాళిగా తెలంగాణ ప్రభుత్వం ఈ మెమోరియల్ పార్క్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి వివరించారు. పార్క్ నిర్మాణ శైలి, ప్రత్యేకతలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. దీనిపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వ చొరవను అభినందించారు.