గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
వీరాపూర్‌లో రూ. 10లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం రాయికల్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో నూతనంగా 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పండుగ వాతావరణం నెలకొందని, అర్హులైన...