గాంధీ భవన్ లో మరోసారి ‘పదవుల’ చిచ్చు..

చామల జాబితాపై మహేశ్ గౌడ్ బ్రేక్! హైదరాబాద్, నవంబర్ 10(ప్రజా ముద్ర న్యూస్) : తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ మీడియా విభాగం నియామకాల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ మీడియా & పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీవీ డిబేట్లలో పార్టీ తరపున వాణి వినిపించేందుకు చామల కిరణ్...