సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు
కోరుట్ల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల నియోజకవర్గంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ–2005) ద్వారా ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. కమిటీ జాతీయ చైర్మన్ చంటి ముదిరాజు ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు వొడ్నాల రామారావు సమక్షంలో కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వొడ్నాల రామారావు ఆర్టీఐ...