PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 9:05 pm Posted by : PRAJA MUDRA NEWS

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

కోరుట్ల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల నియోజకవర్గంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ–2005) ద్వారా ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు.

కమిటీ జాతీయ చైర్మన్ చంటి ముదిరాజు ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు వొడ్నాల రామారావు సమక్షంలో కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వొడ్నాల రామారావు ఆర్టీఐ చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ.. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నిధుల వినియోగం, ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల విధులు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు చట్టబద్ధంగా ఎలా పొందవచ్చో వివరించారు. ప్రభుత్వ సహాయం పొందుతున్న చట్ట పరిధిలోని సంస్థల నుంచి కూడా నిబంధనల ప్రకారం సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.

సమాచార హక్కు చట్టం సామాన్య పౌరుడికి ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల్లో ఆర్టీఐ చట్టంపై విస్తృత అవగాహన కల్పించేందుకు కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిప్ప నిరంజన్, గట్ల ప్రకాష్, చింత సూర్యనారాయణ, ప్రసాద్, బాలే అజయ్, రాధారపు మనోజ్, పులి అనిల్, సత్యనారాయణ, చంద్రశేఖర రావు, కిరణ్, వినయ్, సురేష్, నరేందర్, సాయి కృష్ణ, సృజన్, సురేష్, ఆనంద్, సంతోష్, రమేష్, మధుకర్ తదితర కమిటీ నాయకులు, సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.