వానర సైన్యం దండయాత్ర.. వణికిపోతున్న తీర్పెల్లి!

రహదారిపై కోతుల గుంపుల హల్‌చల్..  15 నిమిషాలు నిలిచిపోయిన రాకపోకలుగడప దాటాలంటేనే బెంబేలెత్తుతున్న గ్రామస్థులు, విద్యార్థులు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్థానికుల వేడుకోలు లక్ష్మణచందా, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం తీర్పెల్లి గ్రామ ప్రజలకు ప్రస్తుతం కోతుల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామానికి చెందిన ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున కోతుల గుంపులు తిష్ట వేసి బీభత్సం సృష్టిస్తుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రద్దీ సమయంలో స్తంభించిన రాకపోకలు: నిత్యం...