వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్‌ను కోరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నందు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఛాంబర్లో జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వానాకాలం వరి పంట కోత దశకు చేరుకుందని, జగిత్యాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించే క్రమంలో మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోకుండా...