డిసెంబర్ నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు..

ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ వెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ. 9 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనకు అప్పులు చేసే అలవాటు కానీ, అబద్ధాలు...