కడెం ప్రాజెక్టు నుంచి 700 క్యూసెక్కుల సాగునీరు విడుదల
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవ- హర్షం వ్యక్తం రైతులు ఖానాపూర్, నవంబర్ 09 (ప్రజా ముద్ర న్యూస్) : ఖానాపూర్ నియోజకవర్గంలోని రైతన్నలకు సాగునీటి కష్టాలు తొలగిపోతున్నాయి. జన్నారం, దస్తూరాబాద్ మండలాల రైతుల ఇబ్బందిని గుర్తించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవ తీసుకుని, కడెం ప్రాజెక్టు నుంచి శనివారం 700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేయించారు. పంటలకు సరిపడా నీరు అందక రైతులు అల్లాడిపోతున్న వైనాన్ని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్రంగా పరిగణించారు. ఈ సమస్యను వెంటనే...