ఉట్నూర్లో ఘనంగా దండారి మహోత్సవాలు..
ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా భారీ ఉత్సవాలు నిర్వహిస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలని పిలుపు ఉట్నూర్, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్) : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి మహోత్సవాలు ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఆదివాసీ కళాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో ఉట్నూర్ పరిసరాలు సందడిగా...