అన్నదాతల పోరాటానికి విజయం.. ఎట్టకేలకు కడెం నీటి విడుదల!
మూడు గంటల పాటు తపాలాపూర్ రహదారిపై రైతుల రాస్తారోకో ఉన్నతాధికారుల జోక్యంతో దిగొచ్చిన యంత్రాంగం జన్నారం, నవంబర్ 09(ప్రజా ముద్ర న్యూస్): పంట చేతికొచ్చే కీలక సమయంలో నీటిని నిలుపుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నదాతలు కదంతొక్కారు. కడెం ప్రాజెక్టు నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలం తపాలాపూర్ గ్రామ రైతులు రహదారిపై బైఠాయించి మూడు గంటల పాటు ఉధృతంగా రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు జలసాధన సమితి తోడవడంతో దిగొచ్చిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఆఘమేఘాలపై కడెం...