జన్నారం చివరి ఆయకట్టు వరకూ నీరందించాలి
కడెం ప్రాజెక్ట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
సానుకూలంగా స్పందించిన ఈఈ ప్రవీణ్ కుమార్
జన్నారం, నవంబర్ 05(ప్రజా ముద్ర న్యూస్) : కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా వరి సాగుకు నీటి విడుదలను ఈనెల 7వ తేదీ వరకు మాత్రమే నిలిపివేస్తామని అధికారులు ప్రకటించడం సరికాదని, చివరి ఆయకట్టు రైతులను దృష్టిలో ఉంచుకొని కనీసం ఈనెల 20వ తారీకు వరకు నీటి విడుదలను పొడిగించాలని జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
గురువారం జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కలిసి కడెం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఆఫీస్‌కు తరలివెళ్లారు. ఆ సమయంలో ఈఈ ప్రవీణ్ కుమార్ ఆఫీసులో అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం నాయకులు ఈఈ ప్రవీణ్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడి, చివరి ఆయకట్టు పంటలకు నీరు అందక రైతులు పడే ఇబ్బందులను వివరించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన పరిస్థితులపై ఈఈ గారు సానుకూలంగా స్పందించి, నీటి విడుదల పొడిగింపుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్, ఎఎంసి చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇసాక్, ముజఫర్ అలీ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శులు మేకల మాణిక్యం, గొర్రె మహేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు ఆకుల సత్యనారాయణ, జాడి రాజేశ్వర్, గుగ్లావత్ రవి నాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుదిరె వెంకన్న, కమలాకర్ రావు, మామిడి జగన్, పాదం రాకేష్, మైదం మల్లేష్, కంటెం శంకర్, ముత్యం సతీష్, పన్నాల గోపాల్, కోవా శాంతయ్య, కాంతయ్య, అజ్మీర రవి నాయక్ మరియు జన్నారం మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.