రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి
అర్హులైన లబ్ధిదారులను త్వరితగతిన గుర్తించాలి.. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జగిత్యాల, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి, వారికి త్వరితగతిన ఇందిరమ్మ...