PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 3:42 pm Posted by : PRAJA MUDRA NEWS

భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షల ఎంపీ నిధులు..

కోరుట్ల, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు భక్తాంజనేయ కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణకు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన ఎంపీకి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుగ్గిల తుకారాం గౌడ్, జిల్లా కార్యదర్శి సుధావేణి మహేష్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు అంబల్లా సుదర్శన్, కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, గందె నవీన్, మోహనరావుపేట భక్తాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బొలిశెట్టి రాజేందర్, ప్రధాన అర్చకులు మెట్టుపల్లి సాయి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.